సమయస్ఫూర్తితో ప్రాణాలు నిలిపిన చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి

20-11-2026 | 11:26pm

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

చేర్యాల, నవంబర్ 20: కుటుంబ కలహాల నేపథ్యంలో శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి(Attempted suicide) ప్రయత్నించిన ఓ యువకుడిని చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వ రెడ్డి(SI Gooda Apurva Reddy) చాకచక్యంగా వ్యవహరించి, సాహసంతో ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా(Jangaon District) బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమేష్(Ramesh) అనే యువకుడు, చేర్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన కేపీఆర్ కాలనీ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి మంటలతో అరుస్తున్న యువకుడిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.ప్రాణాలకు తెగించి క్షణాల వ్యవధిలో స్పందించిన ఆమె, స్థానికుల సహాయంతో గోనె సంచులు కప్పి మంటలను ఆర్పివేశారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని వెంటనే ప్రాణాలతో కాపాడి చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి(Government Hospital) తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి(Siddipet Government Hospital)కి తరలించారు.యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై అపూర్వ రెడ్డి చూపిన సాహసం,స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు