దొమ్మాటలో మాల మహానాడు నూతన కమిటీ ఎన్నిక

20-09-2026 | 07:26pm

చేర్యాల, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి):చేర్యాల మండలంలోని దొమ్మాట గ్రామంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ(State Chief Secretary Butti Satyanarayana) ఆధ్వర్యంలో ఆదివారం మాల మహానాడు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీలో గౌరవాధ్యక్షులుగా తాండ్ర సత్తయ్య,అధ్యక్షులుగా తాండ్ర నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా తాండ్ర వెంకటేష్, కోశాధికారిగా తాండ్ర కనకయ్య ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా గుజక కనకయ్య,తాండ్ర ఆంజనేయులు,సోషల్ మీడియా ఇన్‌ చార్జులుగా తాండ్ర సాగర్, తాండ్ర చందు,

సాదుల రాకేష్ బాధ్యతలు స్వీకరించారు.వీరితో పాటు తాండ్ర ఆంజనేయులు ముఖ్య సలహాదారులుగా,సలహాదారులుగా తాండ్ర చంద్రయ్య, వంగపల్లి నరసయ్య, సమాధుల బిక్షపతి, తాండ్ర పరమేశ్వర్, తాండ్ర సంపత్,తాండ్ర వెంకటేష్,తాండ్ర బాలరాజ్,తాండ్ర రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మాలలకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని,అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు