పంట పండించడానికి ప్రకృతితో పోరాడిన రైతు
పంట అమ్ముకోవడానికి దళారులతో పోరాడుతున్నాడు
బిఆరెస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్
నేరేడుచర్ల,(విజయ క్రాంతి): రైతు జీవితం నిత్యం పోరాటమేనని పంట సమయంలో ప్రకృతితో పండించిన తర్వాత దళారులతో, చివరికి పంట ధాన్యం తరలింపులో రవాణా శాఖ అదికారులతో కూడా ఇబ్బంది పడుతున్నాడని హుజూర్నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు రాపోలు నవీన్ అన్నారు.శుక్రవారం నాడు రైతులతో కలిసి మాట్లాడుతూ,రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు నష్టాలు, మరోవైపు అకాల వర్షాల ప్రభావం, కరెంటు కోతలతో సాగునీరు అందక ఇబ్బందులు, తుఫాను ప్రభావంతో పంట నష్టాలు ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని రైతన్న తన పంటను కాపాడుకున్నాడు.
ఇన్ని కష్టాలు భరించి పండించిన ధాన్యానికి మొదట క్వింటాల్‌కు రూ.5,000 వరకు ధర పలికినా, దళారుల దోపిడీతో రూ.4,000 నుంచి రూ.3,500 వరకు ధర పడిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు అయినా సరే, కష్టపడి పండించిన ధాన్యాన్ని కోసి, ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని మిల్లులకు తరలిస్తున్న సమయంలో ఓవర్‌లోడ్, వాహన పత్రాలు తదితర కారణాలతో ఆర్టివో అధికారులు రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత బాధాకరం అన్నారు.ఆర్టివో అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, ధాన్యం రవాణా చేసుకునే రైతులపై ఓవర్‌లోడ్, పత్రాల పేరుతో కేసులు నమోదు చేయకుండా, నిబంధనల పరిధిలో రైతులకు వెసులుబాటు కల్పించాలని చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో తకెళ్ళ నాగార్జున షేక్ నాగుల్ మీరా అరే శ్రీకాంత్ సైదా నాయక్ పత్తిపాక రమేష్ అమరావరుపు సతీష్ కుమార్ గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.