మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంటి ముట్టడికి యత్నం

21-11-2026 | 07:25pm

కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

సిద్దిపేట టౌన్, నవంబర్ 21: చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను(inappropriate remarks) నిరసిస్తూ సిద్దిపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబుల్ వహాబ్(Abul Wahab) ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రాజనర్సు మంజుల ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు(Police) అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలకాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు