ప్రతి ఒక్కరి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయాలి

21-11-2026 | 07:28pm

సిరికొండ, నవంబర్ 21 ( విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ బీమా పథకంలో(Indiramma Insurance Scheme)   అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను(Beneficiary applications)  ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో  జాగ్రత్తలు తీసుకోవాలని డివిజనల్ పంచాయతీ అధికారి  ఫణిందర్రావు  అన్నారు. శనివారం సిరికొండ మండలంలోని(Sirikonda Mandal) రాంపూర్(బి), సిరికొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తులు ఆన్లైన్  నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దరఖాస్దారుల నామిని వివరాలతో పాటు  సెల్ ఫోన్ నెంబర్ను కచ్చితంగా నమోదు చేయవలసి ఉంటుందని  అన్నారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి  ఇంద్రమ్మ బీమా పథకంలో  వారి వివరాలు, దరఖాస్తులను నమోదు చేసే విధంగా  పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని  సూచనలు చేశారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో  సంతోష్, సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు