శ్రీ శివాలయంలో వైభవంగా ఆకాశదీపం వేడుకలు..

11-11-2026 | 05:59pm

పెద్ద ఎత్తున పాల్గొంటున్న దంపతులు, భక్తులు....

సుల్తానాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో నిర్వహిస్తున్న ఆకాశదీపం వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆశ్విజ పౌర్ణమి నుండి 15 రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఆకాశదీపం వేడుకలు కార్తీక పౌర్ణమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి,  చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి, అర్చక దంపతులు వల్లకొండ మఠం రమేష్ శైలజ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో దంపతులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ఈ సంవత్సరం మొదటిసారి ఆకాశదీపం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:00 నుండి 6:30 వరకు ప్రత్యేక పూజలు అనంతరం ఆకాశ దీపాన్ని పైకి ఎక్కించి పూజలు చేయడం జరుగుతుంది, ఈ వేడుకల అనంతరం నగునూరి ప్రసాద్, ఎల్లంకి వైకుంఠం  ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరుగుతుంది. తదుపరి  భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు.

మరిన్ని వార్తలు