ఉమామహేశ్వర క్షేత్రంలో హనుమాన్ మాల ధారణ
11-11-2026 | 05:56pm
నవంబర్,11( విజయ క్రాంతి) అచ్చంపేట: నల్లమల కొండల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో బుధవారం నిర్వహించిన హనుమాన్ మాల ధారణ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ(Achampet MLA Dr. Chikkudu Vamsikrishna) పాల్గొన్నారు. స్థానిక భక్తులు, హనుమాన్ స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బిరం మాధవరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.