కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

11-11-2026 | 05:52pm

కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందన

కోదాడ నవంబర్ 11 (విజయక్రాంతి): కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Womens Engineering College)లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ బుధవారం తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐన ఐ కేర్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఐ కేర్ అకాడమీ మానవ వనరుల అధికారి కే. సాయిప్రకాష్, డి. మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థినులు 12 మంది విద్యార్థినులు ఎంపిక అయ్యారు. 

ఎంపిక అయిన వారికి  విద్యార్థినులకు వార్షిక వేతనం 3,00,000/- రూపాయలు  ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు కే. సాయి ప్రకాష్ మరియు డి. మాధవి తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అభినందించారు.

మరిన్ని వార్తలు