శతక్కొట్టిన బదోనీ
- భారీస్కోర్ దిశగా ఢిల్లీ
- రఘువంశీ, ముషీర్ సెంచరీలు
- రంజీ ట్రోఫీ రౌండప్
రాంఛీ, అక్టోబర్ 26 : రంజీ ట్రోఫీలో(Ranji Trophy) ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని సూపర్(Ayush Badoni) ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. గుజరాత్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన బదోని తాజాగా జార్ఖండ్ తో మూడో రౌండ్ మ్యాచ్‌లో శతకం బాదా డు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో బదోని వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో85, 217, 106 నాటౌట్ స్కోర్లు చేసినట్లైంది. బదోని సెంచరీతో(Badoni Century) కదంతొక్కడం తో ఢిల్లీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జ ట్టు 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసిం ది. బదోనితో పాటు సుమిత్ మాథుర్ (50) క్రీజులో ఉన్నాడు. అటు హర్యానాతో జరుగు తున్న మ్యాచ్‌లో తొలిరోజు ముంబై ఆధి పత్యం కనబరిచింది. రఘువంశీ, ముషీర్‌ఖాన్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఆటముగిసే సమయానికి ముంబై 3 వికెట్లకు 290 పరు గులు చేసింది. ఇదిలా ఉంటే జింఖానా మై దానంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రో జు ఆట ముగిసే సమయానికి పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.