సెలక్షన్ కమిటీ సమావేశాలకు లక్ష్మణ్
బీసీసీఐ కీలక నిర్ణయం
ముంబై, అక్టోబర్ 7 : భారత జట్టు ఎంపికకు(Indian team selection) సంబంధించి బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ సెలక్షన్ కమిటీ సమావేశానికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(Centre of Excellence) (సీవోఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) కూడా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని బోర్డు సెక్ర టరీ దేవజిత్ సైకియా(Board Secretary Devajit Saikia) వెల్లడించారు. సెలెక్టర్లు, సీఓఈ మధ్య సమన్వయంలో ఎలాం టి లోపాలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలెక్టర్లు, సీఓఈ మధ్య ఎలాంటి అపార్థాలు, కమ్యూనికేషన్ లోపా లు లేకుండా చూడటమే ఈ నిర్ణయం ఉద్దేశమనీ, ఆటగాళ్ల పరిస్థితిపై సెలెక్టర్లకు కచ్చిత మైన సమాచారం అందితేనే సరైన నిర్ణయా లు తీసుకోగలని దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఇటీవల గాయపడిన ఆటగాళ్ల ఫిట్నె స్, రీఎంట్రీపై సీఓఈ నుంచి స్పష్టమైన స మాచారం సెలెక్టర్లకు చేరడంలో ఆలస్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్థిక్ పాండ్యా ఇటీవల కొన్ని సిరీస్‌ల నుంచి చివ రి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది. దీని కి సీవోఈ నుంచి సరైన సమాచారం లేకపోవడమే కారణమని సెలక్టర్లు చెప్పినట్టు వార్త లు వచ్చాయి. ఆ తర్వాత సీవోఈ హెడ్ లక్ష్మణ్‌తో పాటు అక్కడి సిబ్బందితో బీసీసీఐ ప్ర త్యేకంగా సమావేశమైంది.
గతంలో వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు లక్ష్మణ్‌ను కూ డా హాజరయ్యేలా బీసీసీఐ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే గువాహటిలో జరిగిన టీ20, ఇండి యా ‘ఏ’ జట్ల ఎంపిక సమావేశానికి వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యాడు. కాగా అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకోవ డంతో ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే కొత్త చీఫ్ సెలక్టర్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుంది.