స్వింగ్ కింగ్ అదరగొడతాడా?
- హాట్ టాపిక్‌గా భువీ రీఎంట్రీ
- అద్భుతమైన అవకాశమంటున్న ఫ్యాన్స్
* వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) రీఎంట్రీ భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు సీనియర్లందరినీ పక్కన పెట్టేస్తూ యువ ఆటగాళ్ల వైపే మొగ్గుచూపుతున్న హెడ్ కోచ్ గంభీర్, సెలక్టర్లు భువీని నాలుగేళ్ల తర్వాత ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వింగ్ కింగ్‌గా పేరున్న భువనేశ్వర్‌కు ఇది గొప్ప అవకాశమనీ మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ గోల్డెన్ ఛాన్స్‌ను భువీ సద్వినియోగం చేసుకుంటాడా ?
- అద్భుతమైన అవకాశమంటున్న ఫ్యాన్స్
- అగార్కర్ లేకపోవడంతోనే ఛాన్స్
- కివీస్ పిచ్‌లపై చెలరేగే అవకాశం
ముంబై, అక్టోబర్ 7 : ఏ జట్టులోనైనా సీనియర్లకు ప్రాధాన్యత ఉండాల్సిందే. యువ ఆటగాళ్లకు(young players) అవకాశమిస్తూ సీనియర్లను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్తి గా యువ జట్టుపైనే ఆధారపడితే విజయాలు రావడం కష్టమే. అయితే టీమిండియా హెచ్ కోచ్‌గా(Team India Head Coach) గంభీర్ వచ్చిన తర్వాత క్రమక్రమంగా సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి ప్లేయర్స్‌ను బలవంతంగా టెస్ట్ రిటైర్మెంట్(Test retirement) ప్రకటించేలా చేసారన్న వార్తలు కూడా వచ్చాయి. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్(Ajit Agarkar) వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైందన్న అభిప్రాయం వినిపించింది.
అయితే అగార్కర్ పదవీకాలం ముగిసిన కొన్ని రోజులకే మళ్లీ సీనియర్లకు పిలుపు దక్కుతోంది. తాజాగా వెటరన్ పేసర్ భువనేశ్వర్ రీఎంట్రీ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. దాదాపు నాలుగేళ్ల తర్వాత భువీ మళ్లీ జాతీయ జట్టు లో చోటు దక్కించుకున్నాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇక అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని చాలా మంది తేల్చేసిన వేళ భువీ రీఎంట్రీ అందరికీ షాకిచ్చింది. న్యూజిలాండ్ టూర్‌కు స్వింగ్ కింగ్‌ను ఎంపి క చేయడం వెనుక వ్యూహం కూడా కనిపిస్తోంది.
బంతిని రెండు వైపులా స్వింగ్ చేయ డంలో భువనేశ్వర్ సత్తా ఏంటనేది అందరికీ తెలుసు. న్యూజిలాండ్ పిచ్‌లపై కొత్త బం తితో స్వింగ్ రాబట్టడం, అతని అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకోవడం భువీ ఎంపికకు కారణంగా చెబుతున్నారు. కివీస్ పిచ్‌లు సీమ్ , స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్ చేయగలడు. అక్కడి వా తావరణ పరిస్థితులలో ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లను పడగొట్టడానికి అతన్నే అత్యుత్తమ ఎంపికగా సెలెక్టర్లు భావించారు.
అలా గే ఐపీఎల్ 2026 సీజన్‌లో భువీ ఆర్‌సీబీ తరపున అద్భుతంగా రాణించాడు.28 వికెట్లతోఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించా డు. అత్యుత్తమ ఎకానమీతో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అతని ఫామ్ కొనసాగడంతో సెలక్టర్లు భువీ వైపు మొగ్గుచూపారు. ప్రస్తుత జట్టులో బుమ్రాను రొటేషన్ పద్ధతిలో ఎం పిక చేస్తున్నారు. అటు పలువురు యువ పే సర్లు ఉన్నప్పటకీ ఒత్తిడి ఉండే ఆరంభ ఓవర్లు, డెత్ ఓవర్లలో సీనియర్ బౌలర్ ఉం డాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
అర్షదీప్ సింగ్‌తో కలిసి భువనేశ్వర్ ఆ లోటు తీరుస్తాడని సెలక్టర్లు బలంగా నమ్మారు. అతని అనుభవం ఖచ్చితంగా కివీస్ టూర్ లో జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరి నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనదైన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.