భారత్ ఏ జట్టులో పంత్, బుమ్రా
కివీస్ ఏతో మూడో అనధికారిక టెస్ట్ ఆడే ఛాన్స్
బెంగళూరు, అక్టోబర్ 26 : న్యూజిలాండ్(New Zealand) తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు(Team India) గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్(Jasprit Bumrah and Rishabh Pant) పంత్ భారత్ ఏ జట్టుతో చేరనున్నారు. వీరిద్దరూ న్యూజిలాం డ్ ఏ జట్టుతో జరిగే మూడో అనధికారిక టె స్టులో ఆడే అవకాశముంది. ఆసియా క్రీడల తర్వాత బుమ్రాకు బీసీసీఐ(BCCI) రెస్ట్ ఇచ్చింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్ నుంచి కూడా బుమ్రాకు విశ్రాంతినిచ్చింది.
అయితే కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తోం ది. మంగళవారం బుమ్రా బెంగళూరులోని సీవోఈలో ఫిట్‌నెస్ టెస్ట్ ఎదుర్కోనున్నాడు. అటు ఇరానీ మ్యాచ్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. దీంతో ఆటకు దూరమైన పంత్.. ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం.తాజాగా సీవోఈలో ఫిట్‌నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు.త్వరలోనే వీరిద్దరు న్యూజిలాండ్ చేరుకుని.. భారత్ ఏ జట్టు తరఫున మూడో అనధికారిక టెస్టులో ఆడనున్నారు.