హైదరాబాద్‌కు మరో విజయం

06-11-2026 | 05:15am

ఒక వికెట్‌తో ఛత్తీస్‌గఢ్‌పై గెలుపు

హైదరాబాద్, నవంబర్ 5: రంజీ ట్రోఫీ 2 సీజన్‌లో హైదరాబాద్(Hyderabad) జట్టు మరో విజయాన్ని అందుకుంది. జింఖానా గ్రౌండ్స్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హైదారాబాద్ 1 వికెట్ తేడాతో ఛత్తీస్‌ఘడ్‌పై గెలుపొందింది. ఛత్తీస్‌ఘడ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని హైదరా బాద్ 9 వికెట్లు కోల్పోయి చేధించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌ఘడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరు గులు చేసింది. అంజూ తివారీ(72), వికల్ప్ తివారీ(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. రాహుల్ రాదేశ్ (72), హిమతేజ(46)  టాప్ స్కోరర్లగా నిలిచారు. ఛత్తీస్‌ఘడ్ రెండో ఇన్నింగ్స్లో 254 పరుగులు చేయగా, హైదరాబాద్ అద్భుతం గా పోరాడి విజయాన్ని సాధించింది.

మరిన్ని వార్తలు