సిరీస్‌ మనదే..

16-09-2026 | 05:30am

రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం 

సమిష్టిగా రాణించిన బౌలర్లు

బ్యాటింగ్‌లో సంజూ, అభిషేక్ మెరుపులు

నితీష్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 

అఫ్ఘనిస్తాన్‌తో టీ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సమిష్టిగా రాణించిన బౌలర్లు అఫ్గాన్‌ను కట్టడి చేస్తే, తర్వాత సంజూ శాంసన్, అభిషేక్ శర్మ మెరుపులు మ్యాచ్‌ను వన్ సైడ్‌గా మార్చేశాయి. ముఖ్యంగా సంజూ విధ్వంసకర హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత్(India) ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో గాయపడ్డ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లోనూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)కి అవకాశం దక్కలేదు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా తన అంతర్జాతీయ టీ కెరీర్‌లో మొదటి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ఆఫ్గాన్ బ్యాటర్లు భారీ స్కోరు చేయలేకపోయారు. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ (0) అ య్యాడు. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లోనే గుర్బాజ్ పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37 పరుగు లు, 33 బంతుల్లో), సెదికుల్లా అటల్ (12 పరుగులు) కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి 41/1తో ఉన్న అఫ్గాన్ ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి తన మొదటి బంతికే ఇబ్రహీం జద్రాన్‌ను అవుట్ చేయగా, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అటల్ వెనుదిరిగాడు. దాంతో 10 ఓవర్లకు అఫ్గాన్ 67/3తో నిలిచింది.

మిడిల్ ఓ వర్లలో భారత బౌలర్లు ఒత్తిడి పెంచి 5 వికె ట్లు పడగొట్టారు. చివరలో అనుభవజ్ఞుడైన మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ కలిసి కేవలం 28 బంతుల్లోనే 48 పరుగులు చేశారు. దీం తో అఫ్గాన్ 159 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 3, అ ర్షదీప్‌సింగ్ 2, అక్షర్ పటేల్, బుమ్రా, రవి బిష్ణోయ్ తలొక వికెట్ పడగొట్టారు. తర్వాత చేజింగ్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ రెచ్చిపోయారు. అఫ్గాన్ బౌ లర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపించారు.

కేవలం 5 ఓవర్లలోనే బోర్డుపై 55 పరుగులు చేశారు. సంజూ శాంసన్ కేవలం 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 57 పరుగులు చేసి అఫ్గాన్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం ఫామ్‌ను కొనసాగిస్తూ 19 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. వీరిద్దరి వికెట్లు పడినప్పటికీ, ఇషాన్ కిషన్ (38), తిలక్ వర్మ (15) జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 14.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది.

స్కోరు బోర్డు ..

అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 159/8 (ఇబ్రహిం జద్రాన్ 37, రసూలీ 26, రషీద్ ఖాన్ 28, మహ్మద్ నబి 20; నితీష్ కుమార్ రెడ్డి 3/24, అర్షదీప్ 2/35)

భారత్ ఇన్నింగ్స్: 163/3 (సంజూ శాంసన్ 57, అభిషేక్ శర్మ 39, ఇషాన్ కిషన్ 38; రషీద్ ఖాన్ 3/36)

మరిన్ని వార్తలు