సిరీస్ పట్టేస్తారా?
* వరుసగా రెండు అద్భుత విజయాలు.. ఇప్పుడు సిరీస్ విజయం ఊరిస్తోంది.. విదేశీ గడ్డపై తొలి సిరీస్ గెలిచే గొప్ప అవకాశం శ్రేయాస్ ముంగిట నిలిచింది. వెల్లింగ్టన్ వేదికగా మూడో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా, డూ ఆర్ డై పోరుకు కివీస్ సిద్ధమైంది. ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమవడంతో వైభవ్‌కు మరో అవకాశం దక్కనుంది.
- నేడు కివీస్‌తో మూడో టీ20
- సూపర్ ఫామ్‌లో భారత్
- వైభవ్‌కు మరో అవకాశం
- న్యూజిలాండ్‌కు డూ ఆర్ డై
వెల్లింగ్టన్, అక్టోబర్ 26 : భారత్, న్యూజిలాండ్(India, New Zealand) మూడో టీ20కి అంతా సిద్ధమైంది. మంగళవారం వెల్లింగ్టన్ వేదికగా(Wellington venue) ఈ రసవత్తర పోరు జరగబోతోంది. వరుసగా రెండు విజయాలతో 2-0 ఆధిక్యం లో ఉన్న టీమిండియా హ్యాట్రిక్(Team India's hat-trick) సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు ఆతిథ్య కివీస్ కంటే మెరుగ్గా రాణిస్తోంది. రెండో టీ20లో వికెట్లు కోల్పోయినా తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి(Tilak Varma, Nitish Reddy) అద్భుత పో రాటానికి తోడు నమన్ ధీర్ మెరుపులతో మ్యాచ్ గెలిచారు.
దీంతో మూడో టీ20లో సైతం భారత్ జట్టుకే(India team) అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో మరోసారి వైభవ్ సూర్యవంశీకే చోటు దక్కనుంది. అయితే వైభవ్‌ను ఓపెనర్‌గా పంపిస్తారా, వన్‌డౌన్‌లో ఆడిస్తారా అనేది చూడాలి. గత మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ గా వచ్చిన ఈ చిచ్చర పిడుగు ఒత్తిడికి గురైనట్టు కనిపించాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో సంజూ, అభిషేక్ బ్యాట్ ఝులిపిస్తే తిరుగుండదు. తర్వాత తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ రెడ్డి కూడా ఫామ్ లో ఉన్నారు.
ముఖ్యంగా నమన్ ధీర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. అటు కెప్టెన్ శ్రేయాస్ కూడా చెలరేగితే భారీస్కోరు ఖా యం. బౌలింగ్ పరంగా చూస్తే నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ ఇంకా కుదురుకోలేదు. కివీస్ పిచ్‌లు అతని బౌలింగ్ శైలికి సరిపోతాయని అంచనా వేసినా భువీ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కానీ వెల్లింగ్టన్ పిచ్ స్వింగ్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో భువీ చెలరేగుతాడని అంచనా వేస్తున్నారు. అర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తుండగా, స్పిన్నర్లు కూడా పూర్తిస్థాయిలో రాణించాల్సి ఉంది.
మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడినా న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. సొంతగడ్డపై ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే.అయితే ఆటగాళ్ల గాయాలు పెద్ద సమస్యగా మారాయి. వారి ముఖ్యమైన ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ గాయాల వల్ల ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో వారి పేస్ అటాక్ బలహీనపడింది.కెప్టెన్ మిచెల్ సాంట్నర్ గత మ్యాచ్‌లో 4 వికెట్లతో రాణించినా, జట్టుగా కివీస్ విఫలమవుతోంది.. గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్ ఫామ్‌లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం.
ఇక వెల్లింగ్టన్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటూనే, తాజా పిచ్ కావడంతో పేసర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. గతంలో ఇక్కడ 216 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేసిన రికార్డులతో పాటు, 164 పరుగులను డిఫెండ్ చేసుకున్న చరిత్ర కూడా ఉంది.కాగా విపరీతమైన ఈదురు గాలుతో బంతి బాగా స్వింగ్ అవుతుంది.చిన్న బౌండరీలు ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా
భారత్ : సంజు శాంసన్ , అభిషేక్ శర్మ, వైభవ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ , అర్షదీప్, ప్రిన్స్ యాదవ్
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, సిఫర్ట్, జాకబ్స్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), స్మిత్, జేమీసన్,మిలైన్, డఫీ