హైదరాబాద్‌లో ఐజీపీఎల్ సీజన్ 2 షురూ

08-10-2026 | 05:05am

హైదరాబాద్, అక్టోబర్ 7 : ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ సీజన్(Indian Golf Premier League Season) 2 లెగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్ గో ల్ఫ్ క్లబ్ వేదికగా నాలుగు రోజుల పాటు ఈ మెగా టోర్నీ(Mega Tournament) జరగనుంది. దీనికి కృష్ణ పంజాబ్ రాఫ్టర్స్ జీసీ(Krishna Punjab Rafters GC) ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి నగరంలో జరిగే లెగ్‌లలో ఇది మొదటిది. ఈ సందర్భంగా టోర్నీకి సం బంధించిన ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో అత్యుత్తమ గోల్ఫ్ కోర్సుగా(Golf course) ఉన్న గోల్కొండ గోల్ఫ్ క్లబ్‌లో(Golconda Golf Club) ఇంత పెద్ద టోర్నీ జరగడంపై హెచ్‌జీఏ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌తో హెచ్‌జీఏలో పెద్ద టోర్నీల ప్రయాణం ప్రారంభమైం దని, ఇది మరింత అత్యుత్తమ స్థాయికి చేర డం తమకు గర్వకారణంగా ఉందన్నారు. గో ల్ఫ్ క్రీడను ప్రమోట్ చేసే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన స్కూల్ లేదా కాలేజీ విద్యార్థులు తమ ఐడీ కార్డు చూపించి రూ.5 వేల ఫీజుతో ఏడాది మొత్తం తమ క్లబ్‌లో గోల్ఫ్ ఆడొచ్చని ప్రకటించారు. హెచ్‌జీఏతో కలిసి పనిచేస్తుండడంపై ఐజీపీఎల్ సీఈవో  ఉత్త మ్ సింగ్ మండి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ టోర్నీలో పలువురు అంతర్జాతీయ స్థాయి గోల్ఫర్లు, యువ గోల్ఫర్లు కలిసి ఆడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా గోల్ఫ్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో 10 ఫ్రాంచైజీలతో ప్రధాన నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐజీపీఎల్ నిర్వహిస్తున్నట్టు వెల్లడిం చారు. ఇప్పటికే శ్రీలంక, దుబాయి, జోహెనస్‌బర్గ్, మారిషస్ వంటి దేశాల్లో అత్యుత్త మంగా ఐజీపీఎల్‌ను నిర్వహించామని తెలిపారు. గోల్ఫ్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం ద్వారా పలు స్కూల్ విద్యార్థులను సైతం ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు