లివింగ్‌స్టోన్‌కు సన్‌రైజర్స్ గుడ్ బై
- సీఎస్‌కేతో ట్రేడింగ్ డీల్
- రూ.6 కోట్లకే చెన్నై సొంతం
- ఎడ్వర్డ్స్‌ను వదిలేసిన ఎస్‌ఆర్‌హెచ్
- ఖలీల్ అహ్మద్, ఎల్లిస్‌ను తీసుకున్న హైదరాబాద్
ముంబై, నవంబర్ 5: ఐపీఎల్ మినీవేలానికి ముందు రిటెన్షన్ తేదీ దగ్గర పడు తుండడంతో ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ ఒప్పందాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఇద్దరు కీలక ఆటగాళ్లను వదిలేసింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్, ఆసీస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌తో ట్రే డింగ్ చేసుకుంది. వారికి బదులుగా భారత లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్, ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్‌ను జట్టులోకి తెచ్చుకుంది. అయితే ఈ ట్రేడింగ్ డీల్‌లో లివింగ్‌స్టోన్ సగం ధరకే సీఎస్కే గూటికి చేరాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ట్రేడ్ డీల్‌లో భాగంగా అతన్ని 6 కోట్లకే సీఎ స్కే సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో లివింగ్‌స్టోన్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడి 15 పరుగులే చేశాడు. మరోవైపు గాయం కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్‌ను చెన్నై అతని ప్రస్తుత ధర రూ.3 కోట్లతో జట్టులోకి తీసుకుంది. ఈ ఇద్దరు విదేశీ ఆల్రౌండర్ల చేరికతో చెన్నై జట్టు బలం పెరిగింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకుంది.
ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ తాజాగా.. ఖలీల్ అ హ్మద్‌ను తీసుకుంది. అతని ప్రస్తుత ధర 4.8 కోట్లకే జట్టులోకి తెచ్చుకుంది. గతంలో 2018 నుంచి 2021 వరకు ఖలీల్ అహ్మద్ ఎస్‌ఆ ర్‌హెచ్‌కే ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసిన ఖలీల్.. 2026లో గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లే ఆడాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరున్న నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్లతో హైదరాబాద్ జట్టులోకి చేరాడు. అతను కూడా గాయం కారణంగా గత సీజన్ ఆడలేదు.