చివరిది కివీస్‌దే

02-11-2026 | 05:25am

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లోనూ భారత్‌కు చుక్కెదురైంది. మరోసారి బౌలర్లు తేలిపోయిన వేళ కివీస్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు జారవిడవడంతో పాటు బౌలర్లు కీలక సమయంలో పరుగులు కట్టడి చేయలేకపోవడం భారత్ ఓటమికి కారణమయ్యాయి. దీంతో టీ20 సిరీస్‌ను శ్రేయాస్ సేన 3 సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  1. చిత్తుగా ఓడిన టీమిండియా
  2. సిఫర్ట్ మెరుపులు
  3. తేలిపోయిన బౌలర్లు
  4. 3 ముగించిన భారత్

హామిల్టన్, నవంబర్ 1 : నాలుగో టీ20 లో ఓటమి ఎదురవడంతో భారత జట్టు(Indian team) చివరి మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసింది. భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది. టాస్ గెలి చిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యా టింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.

ఓపెనర్లు అభిషేక్ శర్మ (1), సంజు శాంసన్ (4) ఇద్దరూ తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో భారత్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 43 బంతు ల్లోనే 93 పరుగుల మెరుపు భాగస్వామ్యా న్ని నెలకొల్పారు.ముఖ్యంగా ఇషాన్ కిషన్ భారీ షాట్లతో అలరించాడు.

కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఉతికారేశాడు. కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.అటు శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్ అందుకుంటూ కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులతో అర్ధశతకం పూర్తి చేశాడు.

మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ (6) విఫలమైనప్పటికీ, చివర్లో నమన్ ధీర్ (23 బంతుల్లో 33 పరుగులు), తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (17 బంతుల్లో 22 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించారు.నిజానికి ఒక దశలో  111/2తో భారత్ ఒక దశలో 210 పరుగులకు పైగా చేసేలా కనిపించినా, న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే (4/19) నాలుగు వికెట్లతో చెలరేగి భారత వేగానికి బ్రేకులు వేశాడు.

దీంతో భారత్ 191 పరుగులే చేయగలిగింది. బ్యాటింగ్ పిచ్ కావడం తో ఛేజింగ్‌లో కివీస్ కూడా దూకుడుగా ఆడింది. అర్షదీప్ సింగ్ ఫిన్ అలెన్‌ను ఆరంభంలోనే ఔట్ చేసినా తర్వాత సిఫెర్ట్, డారిల్ మిఛెల్ చెలరేగారు.ముఖ్యంగా టిమ్ సిఫర్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మిఛెల్ తో కలిసి 73 పరుగులు జోడించారు. మిఛె ల్ ఔటైన తర్వాత సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ కీలక భాగస్వామ్యం కివీస్‌కు విజయాన్నందించింది.

సిఫెర్ట్ కేవలం 50 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు చేసి సెంచరీకి కేవలం 7 పరుగుల దూరంలో నితీష్ కు మార్ రెడ్డి బౌలింగ్లో అవుటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ మరోసారి భారత బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల తో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు.

భార త బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కినప్పటికీ పరుగులు కట్టడి చేయడంలో విఫల మయ్యారు. మిల్నేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, గ్లెన్ ఫిలిప్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 191/8 ( ఇషాన్ కిషన్ 61, శ్రేయాస్ అయ్యర్ 50, నమన్ ధీర్ 33, నితీశ్ రెడ్డి 22; మిల్నే 4/19, స్మిత్ 2/28, టిక్నర్ 2/38 )

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 195/3 ( సిఫెర్ట్ 93, గ్లెన్ ఫిలిప్స్ 65, డారిల్ మిఛెల్ 29 ; అర్షదీప్ 1/40, వరుణ్ చక్రవర్తి 1/45, నితీశ్ రెడ్డి 1/19)

మరిన్ని వార్తలు