జేపీఎన్సీఈలో జాతీయ స్థాయి పోటీలు
- నిర్వహించడం అభినందనీయం
- పాలమూర్ వీసీ డాక్టర్ జిఎన్ శ్రీనివాస్
మహబూబ్‌నగర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బాక్సింగ్ వంటి క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University)వీసీ డాక్టర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల (జేపీఎన్సీఈ)లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పురుషుల ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కె.ఎస్. రవికుమార్ వీసీకి స్వాగతం పలికారు. అనంతరం బాక్సింగ్ రింగ్లోకి వెళ్లిన వారు క్రీడాకారులను అభినందించి, పోటీల్లో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు జేపీఎన్సీఈ ఆతిథ్యం ఇవ్వడం కళాశాలతో పాటు మహబూబ్నగర్ ప్రాంతానికి గర్వకారణమని డాక్టర్ జి.ఎన్. శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మ న్ కె.ఎస్. రవికుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.