అంతర్జాతీయ స్టార్లతో పృథ్విరాజ్ యోధాస్

09-10-2026 | 05:00am

8 మందితో జట్టు ప్రకటన

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు రెడీ

హైదరాబాద్, అక్టోబర్ 8: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్(Archery Premier League Season 2) కోసం పృథ్విరాజ్ యోధాస్ పటిష్టమైన జట్టును ప్రకటించింది. గత ఏడాది తృటిలో టైటిల్ చేజార్చు కుని రన్నరప్‌గా నిలిచిన యోధాస్ ఈ సారి పలువురు అంతర్జాతీయ స్టార్లను జట్టులోకి తీసుకుంది. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, లిన్ లైష్రామ్ సహ-యాజమాన్యంలో ఎబిక్స్ గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న యోధాస్ జట్టులో 8 మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రముఖ భారతీయ ఆర్చర్లతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అంతర్జాతీయ ప్రతిభావంతులతో కూడిన ఈ జట్టు, కాంపౌండ్ , రికర్వ్ విభాగాల్లో పోటీ పడనుంది.

జట్టులో ప్రపంచ నంబర్ 1 కాంపౌండ్ ఆర్చర్ ఆండ్రి యా బెసెర్రా, ప్రపంచ నంబర్ 3 రికర్వ్ ఆర్చర్ మాటియాస్ గ్రాండేతో పాటు అభిషేక్ వర్మ, కీర్తి శర్మ, తిరుమూరు గణేష్ మణి రత్నం, గాథా ఆనంద్రావ్ ఖడకే, రాజ్ కౌర్, జుయెల్ సర్కార్ ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో పురుషులు, మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండటం తో పాటు కాంపౌండ్, రికర్వ్ విభాగాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. గత సీజన్‌లో టైటిల్ గెలుచుకోవడానికి చాలా దగ్గర గా వచ్చామనీ, ఈ ఏడాది అత్యుత్తమ అంతర్జాతీయ, భారతీయ ఆర్చర్లతో మరింత బల మైన జట్టును రూపొందించామనీ పృథ్విరాస్ యోధాస్ సహ-యజమానులు రణదీ ప్ హుడా, లిన్ లైష్రామ్ చెప్పారు. ఈ సారి  టైటిల్‌ను గెలుచుకోవడమే లక్ష్యమన్నారు. 

మరిన్ని వార్తలు