పంజాబ్ కింగ్స్‌కు షాక్

09-10-2026 | 05:05am

హడిన్, హోప్స్ రాజీనామా

కొత్త ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ వేటలో పాంటింగ్

ఛండీఘర్, అక్టోబర్ 7: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కు షాక్ తగిలింది. ఆ ఫ్రాంచైజీ సపోర్టింగ్ స్టాఫ్‌లో కీలకంగా ఉన్న బ్రాడ్ హడిన్, జేమ్స్ హోప్స్ రాజీనామా చేశారు. హడిన్ ఫీల్డింగ్ కోచ్‌గా, హోప్స్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నారు. హడిన్ చాలా సీజన్లుగా పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్నాడు.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రికీ పాంటింగ్ హోప్స్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరికీ బిగ్‌బాష్ లీగ్‌లో కొత్త బాధ్యతలు రావడంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. దీంతో మినీ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌లను వెతుక్కునే పనిలో పడింది. ఇప్పటికే స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే టీమిండియా బాధ్యతలతో పంజాబ్ కింగ్స్‌ను వీడాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్ల ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. 

మరిన్ని వార్తలు