తన్మయ్ బలోడా సరికొత్త చరిత్ర
- 14 వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు
- యూత్ టెస్టులో ప్రపంచ రికార్డు
- ఆసీస్‌పై భారత్ అండర్ 19 క్లీన్‌స్వీప్
అహ్మదాబాద్, అక్టోబర్ 7 : భారత్ అండర్(India Under-19) 19 స్పిన్నర్ తన్మయ్ బలోడా(Spinner Tanmay Baloda) చరిత్ర సృష్టించాడు. ఒక యూత్ టెస్టులో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియా అండర్(Australia Under) 19 జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్టులో(Second Youth Test) భారత్ అండర్ 19 జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో తన్మయ్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అదరగొట్టిన తన్మ య్ రెండో ఇన్నింగ్స్‌లోనూ స్పిన్ మ్యాజిక్ చూపించాడు. ఏకంగా 8 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
చివరి నిమిషంలో రోహిత్ యాదవ్ స్ధానంలో జట్టు లో చోటు దక్కించుకున్న తన్మయ్ తన స్పిన్ మాయాజాలంతో ప్రపం చ రికార్డును నెలకొల్పాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 14 వికెట్లతో ఈ యువ స్పిన్నర్ సత్తాచాటాడు. గతం లో రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లే యర్ టిమ్ సౌథీ పేరిట ఉండేది. 2007లో భారత్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌథీ రెండు ఇన్నింగ్స్లలో క లిపి 92 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టాడు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యా చ్‌లో తన్మయ్ కేవలం 73 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టి.. 19 ఏళ్ల సౌథీ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తర్వాత భారత స్పిన్నర్ తన్మయ్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌ల్లో 174 పరుగులు చేసిన కంగారు జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది.