ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే డీటీఎఫ్ ధ్యేయం
* సామాజిక బాధ్యతతో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి
* మోతే మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
మోతె, నవంబర్ 27 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యల(Teachers' problems) పరిష్కారంతో పాటు సామాజిక బాధ్యతను నెరవేర్చడమే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(Democratic Teachers Federation) (డీటీఎఫ్) ప్రధాన లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర కౌన్సిలర్, కమిటీ ఎన్నికల అధికారి మన్నూరు నాగన్న అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం(Welfare of Teachers) కోసం సంఘం చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో(Government Joint Staff Council) సభ్యత్వం కల్పించిందని పేర్కొన్నారు. శుక్రవారం డీటీఎఫ్ మోతె మండల శాఖ సమావేశం అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా పొట్టపెంజర వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా నాయకపు పరమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా వనజ, జానయ్య, కార్యదర్శులుగా వెంకన్న, రాజేశ్వరి, రాష్ట్ర కౌన్సిలర్లుగా సింహాద్రి, కవిత, నాగయ్య ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయంగా వ్యవహరిస్తూ విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. తమ ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రమేష్, రాంబాబు, బీఎస్ చారి, రాములు తదితరులు పాల్గొన్నారు.