వెంకన్న సన్నిధిలో సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు
27-11-2026 | 06:09pm
భూపాలపల్లి (రేగొండ), నవంబర్ 27 (విజయ క్రాంతి): రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సింగరేణి డిస్ట్రిక్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు సేవలు అందిస్తున్నారు. భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో సుమారు 20 మంది సభ్యులు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు.
కొండపై ప్రధాన ఆలయంలో భక్తులకు క్యూలైన్ల నిర్వహణతో పాటు తాగునీరు అందిస్తున్నారు. కొండ కింద శివాలయం, గండదీపం వద్ద కూడా భక్తులకు సేవలు అందిస్తూ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.