ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

27-11-2026 | 06:12pm

దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విజ్ఞప్తి

దమ్మపేట, నవంబర్ 27(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ(Ashwaraopet Constituency) పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాగుపల్లి కోదండ రామాలయం, దమ్మపేట వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana ) దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరారు.

ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే వివరించారు. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాలకు నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని, ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

నాగుపల్లి కోదండ రామాలయం, దమ్మపేట వేణుగోపాలస్వామి ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఆలయాల ప్రాంగణాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, భక్తులకు అవసరమైన సౌకర్యాల మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కమీషనర్ ను కలిసిన వారిలో దమ్మపేట వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్ పసుమర్తి సత్యనారాయణ (సత్తిపండు) వున్నారు.

మరిన్ని వార్తలు