ఫార్మసిస్ట్ నాగరాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
30-10-2026 | 05:41pm
తుంగతుర్తి, (విజయ క్రాంతి): ఫార్మసిస్ట్ తునికి నాగరాజుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో వెన్నుపూసకు గాయమై చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను శుక్రవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్(Former MLA Dr. Gadari Kishore Kumar) పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
వారి వెంట తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, నాయకులు గుండగాని రాములు గౌడ్, గౌడిచర్ల సత్యనారాయణ, గోపగాని శ్రీను, రమేష్ గౌడ్, వెంకన్న, రవికుమార్, నవీన్, సాయికిరణ్, పసుపులేటి చింటూ తదితరులు ఉన్నారు.