షటిల్ ఆడుతూ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి మృతి..

28-09-2026 | 11:51pm

సూర్యాపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): షటిల్ ఆడుతూ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి(Health Department Employee) మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి(Thungathurthy Government Hospital)లో రేడియాలజీ  విభాగంలో పనిచేస్తున్న వెలుగు కరుణాకర్(60) జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ షటిల్ గ్రౌండ్ లో షటిల్ ఆడుతూ రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడన్నారు. అది గమనించిన తోటి క్రీడాకారులు సిపిఆర్ చేసిన స్పందన లేకపోవడంతో వెటనే ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారన్నారు. అయితే కరుణాకర్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులుగా సేవలు అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు