సైకిల్‌పై పోలీసుల సందేశం.. ఆరోగ్యమే మహాభాగ్యం.!

29-11-2026 | 04:27pm

* విద్యార్థులకు ఫిట్‌నెస్‌ పాఠాలు.. 

* 100 ఎడిషన్‌ ఆన్‌ సండే ఆన్‌ సైకిల్‌’లో భాగంగా మోతె కస్తూర్బా పాఠశాలలో అవగాహన

మోతె, నవంబర్ 29 (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని మోతె ఎస్‌ఐ లచ్చిరెడ్డి(SI Lachi Reddy) సూచించారు. ‘100 ఎడిషన్‌ ఆన్‌ సండే ఆన్‌ సైకిల్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో పోలీసులు ఫిట్‌నెస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నిత్యం వ్యాయామం చేయడం, సైక్లింగ్‌ అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సైక్లింగ్‌ పర్యావరణానికి మేలు చేయడంతో పాటు శరీరానికి మంచి వ్యాయామమని మోతె ఎస్‌ఐ లచ్చిరెడ్డి వివరించారు.

మరిన్ని వార్తలు