ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.1.20 లక్షల విరాళం

28-11-2026 | 05:28pm

నేరేడుచర్ల, నవంబర్ 28 (విజయక్రాంతి): నేరేడుచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త రావులపల్లి ప్రసాద్, అరుణ దంపతులు రూ.1,20,000 విలువైన విరాళం (Donation) అందించారు. పాఠశాల భవనానికి రంగులు వేయడంతో పాటు మరమ్మతుల (Repair Works) కోసం ఈ సహకారం అందించారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు దాతల దంపతులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినా నేరేడుచర్ల పట్టణంపై ఉన్న అభిమానంతో ప్రసాద్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటారని కొనియాడారు. ఆయన సేవా దృక్పథం (Social Service) అందరికీ ఆదర్శమని అన్నారు.

అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అవసరమైన చోట తన శక్తి మేరకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి చొరవ చూపిన దివ్యాంగ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మిని ప్రసాద్ దంపతులు ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలు, చల్లా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు యారవ లక్ష్మి, వింజమూరు శ్రీకాంత్, మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి, చలసాని శ్రీనివాసరావు, రాచకొండ రామన్న, చలసాని రాజీవ్, మండల ఎంఈఓ బాలు నాయక్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, కొణితం సీతారాంరెడ్డి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు