సెగ్రిగేషన్ షెడ్లు.. అలంకార ప్రాయాలు!
- లక్షల ప్రజాధనంతో నిర్మాణం
- వినియోగంలో మాత్రం నిర్లక్ష్యం-
- తడి, పొడిచెత్త వేరు చేయరు..
- రోడ్ల పక్కనే డంపింగ్
- పంచాయతీ కార్యదర్శులకు పట్టింపు లేదు
- ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు..
నేరేడుచర్ల, అక్టోబర్ 2౬: గ్రామాలను పరిశుభ్రంగా(Clean the villages) తీర్చిదిద్దడం, చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చడం, తడి చెత్తతో సేంద్రియ ఎరువు, పొడి చెత్తలోని ప్లాస్టిక్, గా జు, ఇనుము తదితరాలను రీసైక్లింగ్ చేసి ఆ దాయం పెంచడమే సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం(Construction of segregation sheds) వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. కానీ నేరేడుచర్ల మండలం(Nereducherla Mandal) వ్యాప్తంగా ఉన్న 19 గ్రా మ పంచాయతీలక్షేత్రస్థాయిలో పరిస్థితి మా త్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సెగ్రిగేషన్ షెడ్లు(segregation sheds) నిర్మించినా అవి పూర్తిస్థాయిలో వి నియోగంలో లేవు. చాలా చోట్ల షెడ్లు ఖాళీ గా, షెడ్ల పరిసరాలు కంప చెట్లు పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నిర్మాణం చేశారు.. నిర్వహణ మరిచారు!
ఒక్కో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణానికి సు మారుగా రూ. 2.50 లక్షలు వెచ్చించారు. లక్షలు వెచ్చించి వాటిని వినియోగంలోకి తీ సుకురాక పోవడం వల్ల అలంకారప్రాయ ంగా మారి, లక్ష రూపాయల ప్రజాధనం వ ృధాగా మారింది. షెడ్లు నిర్మించడoతోనే ల క్ష్యం నెరవేరదు. అసలు పని ఆ తర్వాతే మొ దలవుతుంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ(Waste collection), తడి, పొడి చెత్త వేరు చేయడం, షెడ్లకు తరలించడం,అక్కడ మళ్లీ విభజించడం,తడి చెత్తతో కంపోస్టు తయారు చేయడం, పొడి చె త్తను రీసైక్లింగ్‌కు పంపడం,ఈ మొత్తం ప్రక్రి య నిరంతరం సాగాలి.అయితే షెడ్లు నిర్మా ణం పూర్తయినా వాటిని వినియోగంలోకి తీ సుకురావడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోడ్ల పక్కనే చెత్త డంపింగ్:
సెగ్రిగేషన్ అంటేనే చెత్తను వేరు చేయడం. కానీ ఇళ్ల వద్దే తడి, పొడి చెత్త కలిసిపో తే, దానిని షెడ్డుకు తరలించినా ప్రయోజనం ఉండదు.తడి, పొడి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం, చెత్తను షెడ్ల వద్ద కుప్పగా పోసి వదిలేయడం వల్ల సేంద్రియ ఎరువుల తయారీ ప్రశ్నార్థకంగా మారింది. షెడ్ల నిర్వహణకు సిబ్బంది, చెత్త సేకరణకు వాహనాలు, తడిపొడి చెత్తపై ప్రజలకు అవగాహన, కంపోస్టింగ్‌కు అవసరమైన సదుపా యాలు, రీసైక్లింగ్‌కు మార్కెట్,ఇవన్నీ సమన్వయంతో పనిచేయాలి అప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది.
దాదాపు అన్ని గ్రామాలలో చెత్తను సేకరించడం వరకు మాత్రమే సజావుగా జరుగుతుంది కానీ తరలించిన చెత్తను సిగ్రిగేషన్ షెడ్లలో వేయకుండా రోడ్డు పక్కన, రహదారులకు ఇరువైపులా పారబోసి చేతు లు దులుపుకోవడం, కుప్పలుగా పోసిన చెత్త ని వారానికో, పదిరోజులకో కాల్చివేయడం జరుగుతుంది. షెడ్ ఉన్నప్పటికీ చెత్తను నిర్దేశిత ప్రాంతానికి తరలించకపోతే గ్రామ పారి శుధ్య వ్యవస్థలో లోపం ఎక్కడుందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
పట్టింపు లేని అధికారులు
దాదాపుగా అన్ని గ్రామాలలో సెగ్రీగేషన్ షెడ్ల నిరుపయోగoగా ఉండటం, అస్తవ్యస్త నిర్వహణలో పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ప్రశ్నలు తలేత్తుతున్నాయి. గ్రామం లో ప్రతిరోజూ పారిశుధ్య పరిస్థితి ఎలా ఉం ది? ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందా? తడిపొడి చెత్త వేరు చేస్తున్నారా? సెగ్రిగేషన్ షెడ్ పనిచేస్తుందా? కంపోస్టు తయారవుతో ందా? రోడ్లపై చెత్త పడేస్తున్నారా? డంపిం గ్యార్డు పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్నత అధికారులు పర్యవేక్షణ లే దు. ఇకనైనా ఉన్నతాధికారులు నిరంతరం ప ర్యవేక్షణ చేస్తూ, నిరూపయోగంగా ఉన్న సెగ్రీగెషన్ షేడ్లు వినియోగoలోకి వచ్చేలా, పారిశుద్ధ్యం నిర్వహణ పటిష్టంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయన్న విషయం దృష్టికి వచ్చింది. ఇకనుండి నిరంతరంగా గ్రామపంచాయతీలలో పర్యవేక్షణ చేస్తూ, సెగ్రీగెషన్ షెడ్ల నిరుపయోగంగా ఉండటానికి కారణాలు, తడి- పొడి చెత్త సేకరణ, డంపింగ్, పారిశుధ్య నిర్వహణకై తగిన చర్యలు తీసుకుంటాం.
నాగరాజు, ఎంపీఓ, నేరేడుచర్ల