అక్టోబర్ 1న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ
కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ సీనియర్ నేత దరూరి యోగానందచార్యులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 20: తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, దివంగత నేత టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Former Minister Ramreddy Damodar Reddy) విగ్రహావిష్కరణ అక్టోబర్ 1న మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో జరగనుందని, అట్టి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీనియర్ కాంగ్రెస్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానందచార్యులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఆయన సేవలను స్మరించుకుంటూ విగ్రహావిష్కరణను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.