స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విరమించుకోవాలి
సిపిఐ, సిపిఎం డిమాండ్
నల్లబెల్లి, నవంబర్ 27 ( విజయక్రాంతి): అమెరికాతో కేంద్ర ప్రభుత్వం(Central Government) చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(Free Trade Agreement) తక్షణమే విరమించుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి(CPI District Council member Chintakindi Kumaraswamy) డిమాండ్ చేశారు.శుక్రవారం సీపీఐ, సీపీఎం(CPI, CPM) ఆధ్వర్యంలో నల్లబెల్లి తహసీల్దార్ ముప్పు కృష్ణకు(Nallabelli Tahsildar Muppu Krishna) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విదేశీ వాణిజ్య ఒప్పందాల(Foreign trade agreements) వల్ల దేశీయ చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో ఏడాదికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కూలీలకు నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు.
కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు పరికి కోర్నేలు, కడియాల మనోహర్, రైతు సంఘం నాయకులు మామిళ్ల పెద్ద ఐలయ్య, బొడిగ సమ్మయ్య, మామిండ్ల మోహన్ రెడ్డి, యనమల నరసయ్య, దిండు బాబు, బొద్దుల దశరథం, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.