పక్షవాతం లక్షణాలపై ఆలస్యం వద్దు
కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచన
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలను సకా లంలో గుర్తించి వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలని కేర్ హాస్పిటల్స్(Care Hospitals) వైద్యులు సూచించారు. అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, ప్రతి నిమిషం విలువైన దని, చికిత్సలో ఆలస్యం శాశ్వత వైకల్యానికి దారితీయవచ్చని హెచ్చరించారు. కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ క్లినికల్ డైరెక్టర్, న్యూ రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.కె. జైస్వాల్, క్లినికల్ డైరెక్టర్, అకాడమిక్స్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ ఉమేష్ టి మాట్లాడుతూ.. ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, చూపు మందగించడం, నడకలో తూలడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
లక్షణాలు తగ్గిపోయినా వెంటనే వైద్య ప రీక్షలు చేయించుకోవాలని సూచించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం స్ట్రోక్ ముప్పును పెంచుతాయని వైద్యులు తెలిపారు. లక్షణాలు తగ్గుతాయని వేచి చూడకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవ డం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా స్ట్రోక్ ముప్పును తగ్గించుకోవ చ్చని తెలిపారు. చికిత్స అనంతరం కోలుకునేందుకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అవసరమవుతాయని వైద్యులు వివరించారు.