వడ్డీ వ్యాపారస్తులపై కొరడా ఝులిపిస్తున్న పోలీసులు

28-10-2026 | 09:33pm

ఏక కాలంలో 13 మండలాల్లో 25 బృందాలతో తనిఖీలు

18 మందిపై కేసు నమోదు : ఎస్పీ వెల్లడి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారుల(Illegal Money Lenders)పై పోలీసులు కొరడా ఝులిపించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా 13 మండలాలలో 25 బృందాలచే ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారాం చేస్తున్న 18 మంది పై కేసుల నమోదు చేశారు. వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, చెక్కులు, రిజిస్టర్లు, స్థలాల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.  

అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్సు లేని వడ్డీ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు