ఆదివాసీల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న లంబాడాలు

21-11-2026 | 04:20pm

తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గణేష్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదివాసీ తొమ్మిది తెగల సమన్వయ కమిటీ(Tribal Coordination Committee) ఆధ్వర్యంలో డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, కొలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ లోని అంబేద్కర్ భవన్ లో ఆదివాసీ సంఘ నాయకులతో కలిసి సభ వాల్ పోస్టర్లు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా గోడం గణేష్, కొడప సోనేరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాలుగా లంబాడాలు నిజమైన ఆదివాసీలము తామే అన్నట్లు వ్యవహరిస్తూ నిజమైన అడవి బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగనికి విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతు అడవి బిడ్డలకు అందవలసిన విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ లను, అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ లంబాడ సామాజిక వర్గమే కొల్లగొడుతూ అడవి బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు