గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

21-11-2026 | 04:06pm

సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ సంతోష్ నాయక్ 

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు వినతి

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): గిరిజన సమస్యలు(Tribal Issues) పరిష్కరించాలని సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ సంతోష్ నాయక్(Sewalal Vidyarthi Sena State President Guguloth Santosh Nayak) అన్నారు. ఈ మేరకు సంతోష్ నాయక్ శనివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ నాయక్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నూతన తండా గ్రామపంచాయతీ అయిన లంబాడీ తండా (న్యూ)ను సందర్శించి, అక్కడి గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రంగసముద్రం వరకు గ్రావెల్ రోడ్డు మంజూరు చేయాలని, వాంకుడోత్ జైపాల్ ఇంటి నుంచి అజ్మీర గద్దర్ ఇంటి వరకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని, వెనక తండా, ముందు తండాకు తాగునీటి అవసరాల కోసం రెండు బోర్లు మంజూరు చేయాలని, తండా విద్యార్థుల కోసం గ్రంథాలయ భవనం మంజూరు చేయాలని, తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు సంతోష్ నాయక్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు