తహసీల్దార్ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయాలి
వెంకటాపురం,(విజయక్రాంతి): 5వ షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయుటకై,నవంబర్ 30 ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండలం తాసిల్దార్ కార్యాలయం ముట్టడి ప్రచారంలో భాగంగా శనివారం ఆదివాసి సంఘాల కార్యచరణ వేదికగా కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ... 1/70 చట్టం ఐదో షెడ్యూల్ లో ఉన్న ఆదివాసీల భూములకు రక్షణ కోసమే కాదని, ఆదిమ తెగల ఆస్తిత్వనికి, ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలను, వాటి ఉనికిని కాపాడడానికి వచ్చిన రాజ్యాంగ బద్ధమైన చట్టమన్నారు.
నేడు ఈ చట్టానికి ఆదివాసీల ఉనికికి ప్రమాదం ఏర్పడే విధంగా గిరిజనేతరులు 1/70 చట్టాన్ని తీసివేయాలని, కోర్టునుఆశ్రయిస్తున్నారని, ఇది ఆదివాసి సమాజం గమనించాలని అన్నారు. ఒక 1/70 చట్టం మాత్రమే కాదు, పెసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టాలు కూడా అమలుకు నోచుకోవడం లేదని.మనం ఇలాగే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించక పొతే మన మౌనమే మనకు భవితరాలకు మరణ శాసనం కాబోతోంది ఆవేదన వ్యక్తం చేశారు.నవంబర్ 30 న ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తలపెట్టిన వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి ఆదివాసి ప్రజలు, ప్రజా స్వామిక వాదులు,ప్రజా ప్రతినిధులు, మేధావులు వేలాదిగా తరలి రావాలని పిలునిచ్చారు.
ఈ కరపత్ర ఆవిష్కరణలో తుడుం దెబ్బ,జాతీయ నాయకులు యాసం రాజు,జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన సర్వేశ్వరరావు,బొగ్గుల బిక్షపతి,మండల అధ్యక్షుడు కణితి వెంకటకృష్ణ,ఆదివాసి నవ నిర్మాణసేన,రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నరసింహమూర్తి,వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు,జిల్లా కన్వీనర్ కుంజ మహేష్, ఉపాధ్యక్షుడు కంతి విజయ్,గొండ్వానా సంక్షేమ పరిషత్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి,జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్,మండల నాయకులు పూనెం నితిన్,బి.నరసింహమూర్తి, ఆదివాసి సంక్షేమ పరిషత్,ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్,మండల అధ్యక్షుడు తుర్స కృష్ణ బాబు,తుర్స ప్రశాంత్, సూర్యే తదితరులు పాల్గొన్నారు