ఇందిరమ్మ కుటుంబ బీమా ధీమా

21-11-2026 | 04:17pm

నిర్మల్,(విజయక్రాంతి): ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంగ్వాపేట్ సర్పంచ్ సాదా వనిత విజయ్ అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ఈ బీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం ఉంటుందని ప్రతి ఒక్కరు ఈ పథకం లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విజయ్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు