ఇందిరాగాంధీ బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తల్లాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి
మండల సర్పంచులు, కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం
సత్తుపల్లి(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ జీవిత బీమా(Indira Gandhi Life Insurance) పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు గొడుగునూరు లక్ష్మారెడ్డి, తల్లాడ మండలం సీనియర్ నాయకులు దుండేటి వీరా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. శనివారం తల్లాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తల్లాడ మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల మండల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని, గ్రామ గ్రామాన ప్రజలకు సమాచారం తెలియజేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో.జిల్లా ముఖ్య నాయకులు,తల్లాడ మండలం సర్పంచులు, ఉప సర్పంచ్లు,టౌన్ ప్రెసిడెంట్ లు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ VDC చైర్మన్ లు, మాజీ జడ్పీటీసీ లు,మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..