పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
14 మంది పేకాట రాయుళ్ల అరెస్టు...
రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
పేకాటకు స్థలం కల్పించిన జిన్నింగ్ యజమానిపై సైతం కేసు నమోదు...
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే..
ఉట్నూర్, అక్టోబర్ 21( విజయక్రాంతి ): అసాంఘిక కార్యకలాపాలకు(antisocial activities) పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే(Utnoor ASP Ruthvik Sai Kotte) హెచ్చరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని(Indravelly Mandal) పాడుబడ్డ మిట్టల్ జిన్నింగ్ ప్రాంగణంలో(Mittal Ginning Premises) పేకాట(Poker) ఆడుతున్న స్థావరంపై ఆదిలాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ చంద్రశేఖర్(Adilabad Task Force CI Chandrashekhar) ఆధ్వర్యంలోని బృందం దాడులు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్పీ తెలిపారు. నిందితులను విచారించగా, స్థల యజమానికి తెలిసే అక్కడ పేకాట ఆడినట్లు వెల్లడించడంతో సదరు యజమాని గోరేసేట్ పై సైతం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
పేకాట ఆడుతూ పట్టుబడిన 14 మంది నిందితుల వివరాలు:
- తెహెరె గణేష్ (32) ఇంద్రవెల్లి,
- జాదవ్ దత్త (29) హనుమాన్ గల్లి, ఇంద్రవెల్లి,
- జాదవ్ సతీష్ (35) జామిని గ్రామం, జైనూర్ మండలం.
- కేంద్రే సందీప్ (40) జామిని గ్రామం, జైనూర్ మండలం.
- ముప్పవరపు వంశీ (29) రాంనగర్, ఇంద్రవెల్లి,
- కాగ్నే గైనినాథ్ (29) ఇంద్రవెల్లి గ్రామం, మండలం.
- సూర్యవంశీ తథాగత్ (26) సత్వాజిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం.
- చింతవార్ సందీప్ (38) ఇంద్రవెల్లి, మండలం.
- ఫడ్ విశాల్ (24) సాయినగర్, ఇంద్రవెల్లి,
- పాండే సంతోష్ బజార్ గల్లి, ఇంద్రవెల్లి,
- ఫడ్ విజయ్ (27) బజార్ గల్లి, ఇంద్రవెల్లి,
- డగ్గే సుధాకర్ (30) అంజీ, ఇంద్రవెల్లి మండలం.
- నాన్లన్వార్ హృదయ్ (23) సాలేవాడ (బి) గ్రామం, ఉట్నూర్
- గైక్వాడ్ నారాయణరావు (49) ఇంద్రవెల్లి ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయండి అనే విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, గంజాయి, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని ఎఎస్పీ సూచించారు.
ఇందుకోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరుగా పర్యవేక్షించే వాట్సాప్ నంబర్ 8712659973 కు సమాచారం పంపవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే హెచ్చరించారు.