జమలాపురంలో కుష్టి వ్యాధి పై అవగాహన కార్యక్రమం

21-10-2026 | 04:16pm

ఎర్రుపాలెం అక్టోబర్ 21 (విజయక్రాంతి): జమలాపురం ప్రాథమిక ఆరోగ్య(Jamalapuram Primary Health) ఉపకేంద్రం లో సర్పంచ్ తుళ్ళూరి నిర్మలా కుమారి ఆధ్వర్యంలో  కుష్టువ్యాధి(Leprosy) పై  గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  దీనిలోభాగంగా  వైద్యసిబ్బంది మాట్లాడుతూ జాతీయ కుష్టు  నివారణ కార్యక్రమంలో(National Leprosy Eradication Programme) భాగంగా  అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో  ఆశా కార్యకర్తలు(ASHA workers) ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులలో ఎవరైనా  స్పర్శ లేని రాగి లేదా గోధుమ రంగు, చమట రాకుండా ఉన్న మచ్చలు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు లాంటి లక్షణాలు ఉన్న వారిని  కుష్టు వ్యాధి(Leprosy) గా  అనుమానించి బనిగండ్లపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి(Primary Health Center) పంపించడం జరుగుతుందని, ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే వారికి  బహుళ ఔషధ  చికిత్స(ఎండిటి)(Multi-Drug Therapy (MDT)) ద్వారా వ్యాధి పూర్తిగా నయమవుతుందని, వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో అంగవైకల్యం  ఏర్పడుతుందని,పై లక్షణాలు ఉన్న వారు  ఆశా కార్యకర్తలను సంప్రదించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శాయిరెడ్డి, ఆశా కార్యకర్తలు బి.సునీత, నాగమణి, వరలక్ష్మీ, ఎస్.కె సునీత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు