హరీష్ రావుకు మున్సిపల్ చైర్పర్సన్ దసరా శుభాకాంక్షలు
గజ్వేల్, అక్టోబర్ 21: దసరా పండుగను(Dasara Festival) పురస్కరించుకుని గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్(Gangishetti Chandana Ravinder) బీఆర్ఎస్ కౌన్సిలర్లతో(BRS Councilors) కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట(Siddipet) ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును(Tanniru Harish Rao) మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ జెడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ(Gajwel Constituency) బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి(Vanteru Pratap Reddy), బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.