వృధాగా పోతున్న నీటిని అరికట్టేది ఎవరు...?
* నీటి పొదుపు దృష్టి సారించని పంచాయితీ లు..
* నీటిని పొదుపు చేయకుంటే వేసవిలో నీటి కష్టాలే....
ఉట్నూర్, అక్టోబర్ 21( విజయక్రాంతి ):
* పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో నీటిని వృధా చేస్తే అక్కడి ప్రభుత్వం ప్రజలకు జరినామా...
* మహారాష్ట్రలో వాహనాలను నీటితో కడిగితే 5000 జరినామా విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
దేశంలో ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) వర్షాకాలంలో అనుకున్నంత వర్షాలు కురవలేదు.. ఎల్ నినో(El Niño) ను ఎదుర్కొనందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి నీటి పొదుపుపై(Water Conservation) ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు సూచనలు చేస్తుండగా గ్రామాల్లో నీటిని వృధా వెళ్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ఏరియాలో(Utnoor Agency Area) ప్రతి ఏటా వేసవికాలంలో తాగునీటి ఎద్దడి వస్తూనే ఉంది.
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురియకపోవడంతో చలికాలంలోనే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తాగునీటిని పొదుపుగా వాడుకోవడం తోపాటు రభి పంటలను సైతం సాగు చేయవద్దని ప్రభుత్వం ఒకపక్క సూచనలు చేస్తూనే ఉండగా, మరో పక్క గ్రామాల్లో నీటిని వృధాగా వదిలేస్తున్నారు. చలికాలంలో ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న గ్రామాల్లో నీటిని వృధాగా వదిలేస్తున్నారు.
ఇప్పటికైనా గ్రామపంచాయతీ సర్పంచులతోపాటు గ్రామ కార్యదర్శులు నీటి పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. వృధాగా వదిలేస్తున్న నీటిని వృధాగా వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వృధా నీటిని భూగర్భ జలాల్లో పెంపు కోసం గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంకుడు గుంతల నిర్మాణం పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.