జ్యువెలర్స్ షాప్ యజమాని అరెస్ట్

13-11-2026 | 12:56am

బోథ్,(విజయక్రాంతి) నగల తయారీ మరమ్మత్తుల పేరుతో వినియోగదారుల నుండి బంగారం నగదు తీసుకొని తన సొంత అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి డబ్బులతో పరారీ అయిన రంగు రాము అనే వ్యక్తిని ఉదయం పూట పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ డి సాయినాథ్ తెలిపారు. నిందితుని వద్ద నగలు తయారు చేయించుకోవడానికి మరమ్మతులు చేయించుకోవడానికి వచ్చే కష్టం వల్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుండి బంగారం నగదు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది.

నగదు తీసుకొని చెడు వ్యసనాలకు బానిసై సొంత అవసరాల కోసం విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తూ కస్టమర్లను మోసం చేయడం నిందితునికి అలవాటుగా మారిందన్నారు. మండల కేంద్రానికి చెందిన భారతి సమత వద్ద బంగారు గొలుసు తయారు చేస్తానని 45000 తీసుకొని గొలుసు నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. అంతేగాక ముస్తాక్ షేక్ అమ్మ వద్ద తొమ్మిది గ్రాముల బంగారం 15050 రూపాయలు తీసుకోవడం తోపాటు రెండు జతల కమ్మలు తయారు చేసి ఇస్తానని మోసం చేశాడని సిఐ పేర్కొన్నారు.

అంతేగాక మల్లారపు విజయ వద్ద మూడు గ్రాముల బంగారం తీసుకొని మోసం చేయడం జరిగిందన్నారు. తీసుకున్న బంగారాన్ని స్థానికంగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టుపెట్టి తన సొంత అవసరాలకు డబ్బును వినియోగించుకున్నారన్నారు. పోలీసుల భయంతో హైదరాబాదుకు పరారీ అయి తిరిగి గురువారం పట్టణానికి వస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టుకోవడం జరిగిందన్నారు. అయితే ప్రజలు తమ విలువైన బంగారు నగలను అప్పగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై వీ.పురుషోత్తం ఉన్నారు.

మరిన్ని వార్తలు