కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. వ్యక్తి అరెస్ట్

13-11-2026 | 12:48am

న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలింపు

చివ్వెంల,(విజయక్రాంతి): కోర్టు వాయిదాలకు వరుసగా హాజరుకాకపోవడంతో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల మేరకు బానోతు నాగు (తండ్రి బాల్య), పాండ్య నాయక్ తండాకు చెందిన వ్యక్తిని చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై నమోదైన రెండు కేసులకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని, తదుపరి న్యాయపరమైన చర్యల్లో భాగంగా జైలుకు తరలించినట్లు చివ్వెంల ఎస్‌ఐ వి.మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించిన ప్రతి వాయిదాకు సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. న్యాయస్థానం ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు