బేల ZPHS పాఠశాలలో ఘనంగా బాలల వారోత్సవాలు
బేల నవంబర్18(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) బేల మండలంలోని ZPHS బేల (PM SHRI) పాఠశాలలో ఈ రోజు బాలల వారోత్సవాలను(Children's Week Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు(Students') బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలల రక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన(Eradication of Child Labour),POCSO ACT 2012, బాల్యవివాహాల నివారణ(Prevention of Child Marriages), బాలల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో District లీగల్ officer కె. రమేష్, NIC వినోద్ కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ బి. అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బాలల హక్కులను గౌరవించాలని, పిల్లలందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలల సంక్షేమం, రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. బాలల హక్కుల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అనే సందేశంతో కార్యక్రమం నిర్వహించారు.