చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి

18-11-2026 | 06:57pm

సీఐ చెన్నూరి శ్రీనివాస్

స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన సీఐ

భూపాలపల్లి టౌన్, నవంబర్ 18 ( విజయక్రాంతి ) : విద్యార్థులు చదువుతో(Students' studies) పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని భూపాలపల్లి పట్టణ సీఐ చెన్నూరి శ్రీనివాస్(Bhupalpally Town CI Chennuri Srinivas) అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి భూపాలపల్లి ఏరియా(Singareni Bhupalpalli Area) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పయోనీరింగ్ అండ్ క్యాంప్ క్రాఫ్ట్ ట్రైనింగ్ శిబిరాన్ని సీఐ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.

స్కౌటింగ్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, సామాజిక బాధ్యత(Social Responsibility) పెంపొందుతాయని పేర్కొన్నారు. శిక్షణ శిబిరంలో విద్యార్థులు ప్రదర్శించిన పయోనీరింగ్ నైపుణ్యాలు, క్యాంప్ క్రాఫ్ట్ కార్యక్రమాలను పరిశీలించి అభినందించారు. అనంతరం సీఐని మర్యాదపూర్వకంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ‌ఎస్‌ఓసీలు సాయి, నిరంజన్, సుధాకర్, లీడర్ ఆఫ్ ద కోర్స్ శక్తికుమార్, శ్రీనివాస రావు, స్వామి, రాజమౌళి, రమేశ్, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు