ఆదివాసి గుండెల్లో గూడు కట్టుకుంటున్న జిల్లా కలెక్టర్

18-11-2026 | 07:48pm

* ఆదివాసులకు ఆత్మబంధువుగా చిరస్థాయిగా నిలిచిపోతున్నా 4వ  కలెక్టర్ రాజర్శి షా..

* మారుమూల అడవి ప్రాంతం పాలవాగులో పర్యటించిన ప్రథమ కలెక్టర్ 

ఉట్నూర్, నవంబర్ 18( విజయక్రాంతి ): అదిలాబాద్ జిల్లాలోని(Adilabad District) ఆదివాసి గిరిజనుల్లో(Adivasi tribal) గుండెల్లో జిల్లా కలెక్టర్ రాజర్శి షా(District Collector Rajarshi Shah) 4వ కలెక్టర్ గా ఆదివాసి గిరిజనులు మర్చిపోలేని విధంగా వారి సమస్యలు పరిష్కరిస్తూ.. వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్నాడు. అదిలాబాద్ జిల్లా కలెక్టర్ లు విధులు నిర్వహించిన సి వి ఎస్ కే శర్మ  ఉట్నూర్ ప్రాంతంలోని(Utnoor region) మారుమూల గిరిజన గ్రామాల్లో  పర్యటించి ఆదివాసిగూడలో మౌలిక వసతులు(Basic infrastructure) కల్పించేందుకు  ప్రత్యేక కృషి చేశారు. ఆయన సేవలను నేటికీ  ఆదివాసిగూడలోని వృద్ధులు  నేటికీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సి వి ఎస్ కే శర్మ తర్వాత   2001 లో జిల్లా కలెక్టర్గా వచ్చిన  రామకృష్ణారావు మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించి  చిమ్ము చీకట్లో ఉంటున్న గూడాలను గుర్తించి  విద్యుత్ సౌకర్యం(Electricity facility) తో పాటు  రహదారి సౌకర్యాలు కల్పించి  గిరిజనుల మన్నులు పొందారు. 2001లో  నక్సల్ ప్రభావిత ప్రాంతమైన   

వాయిపేట్, రిమ్మ, చీమనుగుడి, గోపాల్పూర్  గ్రామాలతో పాటు  గిరిజన ప్రాంతంలోని మారుమూల  అడవి ప్రాంతంలోని గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు  రవాణా సౌకర్యం    కల్పించారు. ఆ రోజుల్లో గ్రామ పటేల్ గా ఉన్న  పెద్దలు నేటికి రామకృష్ణారావు  ను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. రామకృష్ణారావు తర్వాత  చాలా సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్ గా  పదవి బాధ్యతలు  చేపట్టిన దివ్య దేవరాజన్  ఆదివాసులకు ఆడపడుచు గా  పేరు సంపాదించడంతోపాటు  ఆదివాసులలో వెలుగుల దివ్యగా  పేరు సంపాదించుకున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని  మామిడి గుడా(జీ )రెవెన్యూ  గ్రామానికి మండల స్థాయి అధికారులు రికార్డులలో  పేరు చూసుకోవడం తప్ప ఆ గ్రామానికి వెళ్లలేదు.

జిల్లా కలెక్టర్గా దివ్య దేవరాజన్  మామిడి కూడా గ్రామానికి వస్తున్నట్లు మండల స్థాయి ఎంపీడీవో, తహసిల్దారులకు  సమాచారం రావడంతో గ్రామానికి వెళ్లేదేలా అని  ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో కలెక్టర్ కారు వచ్చి మామిడిగూడ (జీ ) ప్రయాణం చేస్తుండగా కలెక్టర్ కారు వెనకాల  మండల స్థాయి అధికారుల కారులు బయలుదేరి వెళ్లాయి. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్  ప్రతి మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించి  వారి సమస్యలు పరిష్కరించడం తో పాటు  జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించి  నేటికీ  దివ్య దేవరాజన్  పేరును ఆదివాసులు స్మరిస్తూ ఉంటున్నారు.

దివ్య దేవరాజ్ తర్వాత  జిల్లా కలెక్టర్గా  రాజర్శి షా పదవి బాధ్యతలు చేపట్టి నుండి  ప్రజల సమస్యలు పరిష్కరించుతూ.. నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు  మండల స్థాయి అధికారులు వెళ్లిన గ్రామాలకు సైతం వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. మారుమూల అడవి ప్రాంతంలో నివాసముండే గ్రామాలకు వెళ్లి వారి సమస్యలను పరిష్కారం చేస్తూ ఆదివాసి గిరిజనుల గుండెల్లో  గూడు కట్టుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా  రిమ్మ గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించిన సందర్భంగా  ఆదివాసుల సాంప్రదాయ ధోతి, కమీజు ధరించి  ప్రత్యేక నృత్యం చేయడంతో పాటు  గుస్సాడి వేషధారణలో ధరించి  నెమలీ ఈకల  టోపీని ధరించిన  చిత్రాన్ని రిమ్మ గ్రామ పటేల్ తో పాటు  గ్రామ పెద్దలు బహుకరించారు.

* కలెక్టర్ల పేర్లతో గ్రామాలు..

* అదిలాబాద్ జిల్లా  కలెక్టర్లుగా విధులు నిర్వహించిన  దివ్య దేవరాజన్ పేరుతో దివ్య గూడెంగా అదిలాబాద్ రూరల్ మండలంలో వెలిసింది. ప్రస్తుత జిల్లా కలెక్టర్  రాజర్శి షా పేరుతో అదిలాబాద్  రూలర్ మండలంలో  రాజర్శి షా గూడెం ఏర్పాటు చేసుకున్నారు ఆదివాసులు. నిస్వార్ధంగా  సేవలందించే అధికారుల పేర్లు  అదిలాబాద్ జిల్లా వాసులు  ఎప్పుడు మర్చిపోలేనడానికి  జిల్లాలో పనిచేసిన, పనిచేస్తున్న కలెక్టర్ ఎందుకు నిదర్శనం. సిరికొండ మండలంలోని  కుంటాగూడ పంచాయతీ పరిధిలోని పాలవాగుకు జిల్లా కలెక్టర్ వెళ్లడం తో అక్కడి గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు