వివిధ పోటీల్లో సర్వజ్ఞ విద్యార్థుల ప్రతిభా విజయాలు

18-11-2026 | 08:19pm

ఖమ్మం ఎడ్యుకేషన్ విజయక్రాంతి: సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు(Students of Sarvajna School) వివిధ సాంస్కృతిక, శాస్త్రీయ, సామాజిక అవగాహన పోటీల్లో(Cultural, Scientific, and Social Awareness Competition) ప్రతిభ కనబరిచి బహుమతులు, ప్రశంసా పత్రాలు సాధించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో(Bhakta Ramadasu Kalakshetram) నిర్వహించిన బాలోత్సవ్‌-2026లో జానపద నృత్యం(Folk dance), గ్రూప్ డాన్స్ విభాగాల్లో సత్తా చాటారు. గ్రూప్ డాన్స్ విభాగంలో విజేతలుగా నిలిచి విన్నర్స్ షీల్డ్ కైవసం చేసుకున్నారు.

అలాగే మంచికంటి భవన్‌లో నిర్వహించిన విజ్ఞాన దర్శిని సైంటిస్ట్ వేషధారణ పోటీల్లో, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్' క్విజ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు.

చదువుతో పాటు కళలు, విజ్ఞానం, సామాజిక అవగాహన రంగాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడం అభినందనీయమని పాఠశాల చైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, డైరెక్టర్ కె. నీలిమ పేర్కొన్నారు. విజేతలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

మరిన్ని వార్తలు