వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

18-11-2026 | 08:16pm

జన్నారం, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో(Market Yard) ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain purchasing center) ఎమ్మెల్యే బొజ్జు పటేల్(MLA Bojju Patel) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల(Farmers') అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. 

రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డి ఆర్ డి ఓ దాసరి అంజయ్య, తహసిల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు